తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశాను. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా గాంధీ ఆనాడు మాట ఇచ్చారు. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు' అని చెప్పారు.