తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దిలావర్పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు.