ప్రధాని మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు పక్కా వస్తాయని మోదీతోపాటు మిగతా నేతలంతా ఊదరగొట్టారని.. కాని వాస్తవానికి 240 సీట్లుకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోడీ ఓటమి అని అన్నారు. బీజేపీ ఎన్నికల అజెండా వేరు.. కాని అమలు చేసే రహస్య అజెండా వేరని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రముఖ 'ద ఇండియన్ ఎక్స్ప్రెస్' అడ్డా కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.