లవంగాలతో చేసిన టీతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లవంగాలతో చేసిన టీని తాగడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పంటినొప్పి, నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముఖ్యంగా లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా కాపాడి క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తాయి.