ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మాలలు వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణలో ఉద్యమాలను ఉదృతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ మంత్రి నర్సింహ్మయ్య కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా మాలలు కదిలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.