కర్ణాటకకు వెళ్లే బస్సులను మహారాష్ట్ర నిలిపివేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న బస్సుపై అలాగే బస్సు డ్రైవర్‌పై పలువురు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దీనిని సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకు వెళ్లే అన్ని బస్సులను నిలిపివేసింది.