తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29వ తేదీన దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని BRS పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివాస్ నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని తెలిపారు. కాగా, కరీంనగర్లో జరిగే 'దీక్షా దివస్' లో కేటీఆర్ పాల్గొననున్నారు.