తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు హీరోయిన్ అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా అలాగే ప్రవర్తించాడు. అప్పుడు ధైర్యం లేక కొట్టలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ధైర్యం ఉంది. ఎవరైనా అలా ప్రవర్తిస్తే కచ్చితంగా కొడతా' అని అన్నారు.