సాధారణ సీజన్ల కన్నా చలికాలంలో చాలామంది బాడీ పెయిన్స్‌తో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం వాతావరణ మార్పులు, తేమ శాతం తగ్గడమేనని పేర్కొంటున్నారు. ఎక్కువ మంది వెన్నునొప్పి, కీళ్ల నొప్పి, చర్మంలో మార్పులను ఎదుర్కొంటున్నారు. మరికొందరు వ్యాయామాలు చేయడానికి, నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. జీవన శైలిలో మార్పులు, వైద్యుల సలహాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.