ఓటు అడిగే హక్కు బీజేపీ నేతలకు లేదు: సీఎం రేవంత్

85பார்த்தது
ఓటు అడిగే హక్కు బీజేపీ నేతలకు లేదు: సీఎం రేవంత్
తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ నేతలకు లేదని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, RRRకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే అని మండిపడ్డారు. అసలు ఏ అర్హత ఉందని బీజేపీ నేతలు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే కిషన్ రెడ్డి ప్రతీసారి అడ్డు తగులుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేని దద్దమ్మ కిషన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி