తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్పీడ్ పెంచిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో టాప్ గేర్ వేసి మంచి ఫలితాలను రాబట్టింది. అదే ఊపులో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు తగిన విధంగానే ప్రణాళిలకు రచిస్తోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తమకు గట్టి పట్టుందని బీజేపీ భావిస్తోంది. ఆ రెండు సీట్లలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.