బిట్‌కాయిన్ మరోసారి రికార్డు సృష్టించింది. ట్రేడింగ్ సెషన్లో మొదటిసారిగా 94 వేల డాలర్ల మార్క్ దాటింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత బిట్‌కాయిన్ ధర దాదాపు 26 వేల డాలర్లకు పైగా పెరిగింది. తాజాగా బిట్‌కాయిన్ ట్రేడింగ్ సెషన్లో రికార్డు స్థాయిలో 94,038.97 డాలర్ల వద్ద కనిపించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.80 లక్షలు. అయితే ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 92 వేల డాలర్ల వద్ద ట్రేడవుతోంది.