సాధారణంగా బిచ్చగాళ్లు అడుక్కునే సమయంలో.. మన దగ్గర చిల్లర ఉంటే వేస్తాం, లేకుంటే లేదని చెప్తాం. కానీ ఈ బిచ్చగాడిని చూస్తే.. భయంతో చేతుల్లో ఏదీ ఉంటే అది ఇచ్చేస్తాం. ఎందుకో తెలుసా.. ఆ బిచ్చగాడు అందరిలాగా మాములుగా అడుక్కోవడం లేదు.. పాములను చూపించి మరీ భయపెట్టి దర్జాగా అడుక్కుంటున్నాడు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.