భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాలయాల్లోని యుద్ధ క్షేత్రాల సందర్శనకు సంబంధించి ఆర్మీ సంచలన నిర్ణయం ప్రకటించింది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్‌లలో టూరిస్ట్లను అనుమతించాలని నిర్ణయించింది. 'పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించాం. వచ్చే ఐదేళ్లలో పర్యటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది’ అని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.