మునగాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోదు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. దీనిలో అధిక మొత్తంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎముకలు, దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, బీపీని తగ్గిస్తాయి. మునగాకులోని పొటాషియం, కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.