తెలంగాణలో 50 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా ఎల్బీ స్టేడియం వేదికగా క్షమాపణ చెబుతానని సీఎం రేవంత్ అన్నారు. 'రూ.11వేల కోట్ల రుణమాఫీకి KCR ఐదేళ్లు తీసుకున్నారు. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తాం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. అప్పుడు మీ సంగతి తేలుస్తాం' అని అన్నారు.