విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ లేబొరేటరీస్‌లో విష వాయువులు లీక్ అవడంతో అందులో పని చేసే 9 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డార. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద కారకులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.