బ్రిడ్జ్ పై నుంచి నదిలో పడి వ్యక్తి మృతి

74பார்த்தது
బ్రిడ్జ్ పై నుంచి నదిలో పడి వ్యక్తి మృతి
మహారాష్ట్రలోని పొడ్సా గ్రామం మధ్యలోని పెన్ గంగా నది వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ కమలాకర్ వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాంకు చెందిన ప్రశాంత్ (39) వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. గురువారం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி