భైంసా: 74 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నామని భైంసా గ్రామీణ సీఐ నైలు అన్నారు. మంగళవారం భైంసా మండలం వానల్పడ్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ బలగాలు రెండు గంటల పాటూ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి సరైన అనుమతి పత్రాలు లేని 72 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.