పత్తి రైతులకు తేమ విషయంలో అధికారులు సహకరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం సోనాలలోని గురు సాహెబ్ చంద జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా తొలి రైతును సన్మానించి, తూకం వద్ద రిబ్బన్ కట్ చేసి కొనుగోలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేను సీసీఐ అధికారులు శాలువాతో సత్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, తహశీల్దార్ సుభాష్, అధికారులు ఉన్నారు.