ఇచ్చొడ మండలం నర్సాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలతో, అంగన్ వాడి భవనానికి రూ. 12 లక్షలతో నిర్మాణాల భూమి పూజ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. నర్సాపూర్ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.