వాంకిడి: ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు మానుకోవాలి
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు మానుకోవాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. ఫుడ్ పాయిజన్తో అనారోగ్య బారిన పడిన విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు అసత్యమని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో వివరించారు.