గోవింద నామస్మరణతో జిల్లాలోనే సుప్రసిద్ధ జైనథ్ శ్రీ లక్ష్మి నారయణ స్వామి ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. భక్తుల జేజేల నడుమ లక్ష్మి సమేతంగా శ్రీమన్నారాయణుడు పంచ వాహనుడై గ్రామ వీధుల్లో ఊరేగారు. శోభాయాత్ర ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన అశేష భక్త జన వాహినితో జైనథ్ మండల కేంద్రం సందడిగా మారింది.