హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కామర్స్ కళాశాల ఆవరణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబరేషన్ డే ఫొటో ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కట్ చేసి ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.