ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు

583பார்த்தது
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు
ఆదిలాబాద్ పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ను విక్రయిస్తున్న దుకాణాల్లో బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ లోని ఓ దుకాణం, మున్నూరు కాపు సంఘ భవనం సమీపంలో మరో దుకాణంలో 4 క్వింటాళ్ల నిషేధిత పాలిథిన్ కవర్లు, వస్తువులు లభ్యమయ్యాయి. దుకాణాల యజమానులకు 5 వేల చొప్పున జరిమానా విధించారు. నిషేధిత ప్లాస్టిక్ ను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி