ఆదిలాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వచ్చిన పత్తి బండ్ల కొనుగోలు శుక్రవారం ఆలస్యం జరిగినందున ఆ యొక్క పత్తి బండ్లు ఈనెల 26న శనివారం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్ తెలిపారు. కొత్త పత్తి బండ్ల యొక్క కొనుగోలు ప్రక్రియను ఈనెల 28 తేదీ సోమవారం నుండి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పత్తి రైతులు గమనించి సహకరించాలని కోరారు.