విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రెడ్డి కులస్తులను ఆదివారం ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని రెడ్డి హాస్టల్ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కొలువులు సాధించినవారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.