సివిల్స్ శిక్షణ అధికారుల బృందం ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించనున్నట్లు మున్సిపాల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా వారు బల్దియా కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరును ఆరా తీయడంతో పాటు పట్టణంలోని వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులపై ఆరా తీసి స్థానికులతో మాట్లాడుతారన్నారు. కావున అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రగతి నివేదికలతో బల్దియా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.