మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్షాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. బీజేపి ఎమ్మెల్యే అభ్యర్ధి సుధీర్ మునగంటివార్ను గెలిపించాలని తెలుగువారిని కోరారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో రావడం ఖాయమని పేర్కొన్నారు.