నటుడు, సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులో కన్నుమూశారు. క్యాన్సర్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1964లో తొలిసారిగా ‘రాముడు-భీముడు’ చిత్రంలో నటించారు. 15 ఏళ్లపాటు నటుడిగా పలు సినిమాల్లో కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రహీరోలతో జాగర్లమూడి తీసిన ఆరు సినిమాలు అఖండ విజయాలు సాధించాయి.