సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ

1092பார்த்தது
సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ
హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్‌లో మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ 2025 జనవరిలో ప్రారంభం కానుంది. వాస్తవానికి ఇందిర ఈగలపాటి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ధూళిపాళ్ల. వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. లోకో పైలట్ ఇందిరా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி