భారత నౌకాదళానికి చెందిన స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి భారీ ప్రమాదానికి గురైంది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో నౌకాదళ సబ్‌మెరైన్‌ను చేపల వేట పడవ మారథోమా ఢీకొంది. ఈ విషయాన్ని శుక్రవారం రక్షణశాఖ అధికారులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో పడవలో 13 మంది ఉన్నారు. వీరిలో 11 మందిని రక్షించినట్లు భారత నౌకాదళం పేర్కొంది. మరో ఇద్దరు ఆచూకీ గల్లంతైంది. వీరి కోసం కూడా గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.