బెంగుళూరులో 14 నెలల పసిపాపకు గుండెమార్పిడి చికిత్సను నారాయణ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. 14 నెలల పాప గుండె సమస్యతో బాధపడుతుండగా, ఆమెకు గుండె మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ రెండున్నరేళ్ల చిన్నారి అచేతన స్థితికి చేరి బ్రెయిన్ డెడ్ అయ్యింది. చిన్నారి కుటుంబం మానవత్వంతో అవయవదానానికి ఒప్పుకుంది. ఆ చిన్నారి గుండెను తీసి 14 నెలల పాపకు అమర్చారు. పాప ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు శుక్రవారం తెలిపారు.