పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద సుమారు 16 డ్రోన్లను బోర్డర్ సెక్యూరిటీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి ఆ డ్రోన్లను సీజ్ చేశారు. దీనికి తోడు 16 కిలోల మత్తుపదార్థాలను కూడా బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఆ స్మగ్లింగ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. నవంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు 16 డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు.