రాగి జావ తాగి 14 మంది విద్యార్థులకు అస్వస్థత

82பார்த்தது
రాగి జావ తాగి 14 మంది విద్యార్థులకు అస్వస్థత
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గరాజు పేట ప్రాథమిక పాఠశాలలో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాగి జావ తాగిన 26 మంది విద్యార్థుల్లో 14 మందికి వాంతులు అయ్యాయి. దాంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆర్డీవో మాధవి పరామర్శించారు. విద్యార్థులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

தொடர்புடைய செய்தி