![ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్](https://media.getlokalapp.com/cache/1a/ef/1aef21a821cf1e892ecc3ee89914a672.webp)
కామారెడ్డి
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
కామారెడ్డి పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందగా పట్టణ పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా గోనె శేఖర్, గంగోలి సత్యనారాయణ, శివరాం ప్రదీప్, ముదాం బాలకిషన్, సుంకరి సాగర్, నంగి సాయిలు అనే ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. వీరి వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, నాలుగు మోటార్ సైకిల్, రూ. 9, 300 నగదు సీజ్ చేయడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.