Mar 31, 2025, 16:03 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి: ఎండిన పంటతో రైతు ఆత్మహత్య
Mar 31, 2025, 16:03 IST
వేసిన పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజంపేట మండలం పొందుర్తిలో జరిగింది. ఎస్సై పుష్పరాజ్ కథనం ప్రకారం పొందుర్తి గ్రామానికి చెందిన తిరుగుడు స్వామి (36) పొందుర్తి శివారులో తనకున్న 2 ఎకరాల పంట పొలం నీరులేక ఎండిపోయింది. దీంతో మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని భార్య పోచవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.