Oct 17, 2024, 02:10 IST/మంథని
మంథని
సుల్తానాబాద్: గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు
Oct 17, 2024, 02:10 IST
గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ తెలిపారు. సుల్తానాబాద్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కనుకుల గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపీ ఆవుల లక్ష్మీరాజం పాల్గొన్నారు.