Sep 14, 2024, 16:09 IST/వేములవాడ
వేములవాడ
గణేష్ మంటపం వద్ద సహస్ర దీపారాధన
Sep 14, 2024, 16:09 IST
వేములవాడ పట్టణంలోని శ్రీ సాయిగణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి వినాయక మంటపం వద్ద సహస్ర (దీపారాధన) అలంకరణ పూజా కార్యక్రమాన్ని మహిళా భక్తులు ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.