Apr 03, 2025, 18:04 IST/
రోజూ ఉదయాన్నే లవంగం నీరు తాగితే జీర్ణ సమస్యలు దూరం
Apr 03, 2025, 18:04 IST
రోజూ ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగడం వల్ల ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లవంగంలోని కొన్ని రకాల గుణాలు కొవ్వులను వేగంగా కరిగించి బరువుని నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. లవంగం వాటర్ నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుందని.. అలాగే దీనిలోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు. లవంగం నీరు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుందని అంటున్నారు.