పెదవేగి: పురుగుమందు తాగి వ్యక్తి మృతి
మద్యం తాగి వచ్చిన భర్తను భార్య మందలించడంతో మనస్థాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెదవేగి మండలంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన రాంబాబు కుటుంబం మండలంలోని బాపిరాజు గూడెం రైతు వద్ద కవతం ఉంటున్నారు. ఆదివారం మద్యం తాగడంతో భార్య సులోచన మందలించింది. దీంతో మనస్థాపానికి సోమవారం రాంబాబు పురుగుమందు తాగి మృతి చెందాడన్నారు.