వైసీపీ నాయకులు ఘోరంగా దోచుకున్నారు
దెందులూరు మండలం ముప్పవర లో బుధవారం గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ "రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసిపి పాలనలో ప్రజలను వైసిపి నాయకులు బందిపోటు దొంగల కన్నా ఘోరంగా దోచుకున్నారన్నారు. అటువంటి వైసిపి నాయకుల అక్రమాలు, దోపిడీలు కూటమి ప్రభుత్వంలో సాగనివ్వమన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేస్తామన్నారు.