మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని ఉన్నత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.