ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో వచ్చే నెల 7 నుండి 13 వరకు జరగబోయే 90వ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలకి సంబంధించిన ఆహ్వాన పత్రికను శుక్రవారం విజయవాడలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు.