ఉంగుటూరు మండల పరిషత్ ఉప్పాకపాడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు తమవంతు సహకారం అందించారు. పాఠశాల ఎస్. ఎమ్. సి. ఛైర్మన్ కన్నాటి వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు నక్కా సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇంటి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించారు. ఎమ్. ఎల్. ఏ. ధర్మరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనంలోనే కష్టాల్లో ఉన్న వరద బాధితులకు సహాయం చేయడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.