భారతదేశం గర్వించదగ్గ మేధావి కమ్యూనిస్టు సిద్ధాంత వేత్త సీతారాం ఏచూరి మరణం దేశానికి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండలం కైకరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. సభకు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు అధ్యక్షత వహించారు.