ప్రమాదభరితంగా ఉన్న గణపవరం - బొబ్బిలి వంతెనను ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయలు బాబురావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక బిటి రణధీవే భవనంలో జరిగిన పార్టీ మండల కమిటి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక వెంకయ్య వయ్యేరు పైన ఉన్న బొబ్బిలి వంతెన నిర్మాణం విషయంలో అధికార పక్ష నాయకులు నిర్లక్ష్యంగా వ్వవరిస్తున్నారని అన్నారు.