పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతని వద్ద నుండి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ కళ్యాణ్ చక్రవర్తి ఇన్స్పెక్టర్ మురళీమోహన్, దొరబాబు, పాల్గొన్నారు. అలాగే అక్రమంగా బెల్టు షాపులు ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.