ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీలోని మారుమూల గ్రామమైన ముంజులూరులో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ ఇన్ ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని అన్నారు.