విఓఏలకు కాలపరిమితి సర్క్యులర్ రద్దుచేసి ఆరు నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలని సీఐటియూ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండల కార్యదర్శి ఎర్నం సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కుకునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం యానిమేటర్ ధర్నా నిర్వహించి, జూనియర్ అసిస్టెంట్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం వివోఎలా సమస్యలు పరిష్కరించాలని కోరారు.